సినిమా సెట్లోనే హీరో పై దాడి.. చేసింది ఎవరంటే..?

సినిమా సెట్లోనే హీరో పై దాడి.. చేసింది ఎవరంటే..?

Arjun Kapoor who is currently shooting in Uttarakhand for his film, Sandeep aur Pinky Faraar was allegedly assaulted by a drunk man on sets. The man, who is a driver by profession, has been arrested. br br బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్‌పై దాడి జరిగింది. సందీప్ ఔర్ పింకీ పరార్ అనే సినిమా షూటింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్నది. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో అర్జున్ కపూర్ స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. br డిసెంబర్ 4న (సోమవారం) ఉదయం ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అర్జున్ కపూర్ వద్దకు వచ్చాడు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు చేయి చాపగానే చేతిని మెలిపెట్టాడు. ఆ తర్వాత ఆయనపై దాడి చేశాడు. ఆ సమయంలో పిథోర్‌గఢ్ అనే ప్రాంతంలో అర్జున్ వ్యానిటీ వ్యాన్‌ వద్ద ఉన్నాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని కమల్ కుమార్ అని, అతడు ఓ డ్రైవర్ అని గుర్తించారు. br అర్జున్ కపూర్‌పై దాడికి పాల్పడిన కమల్ కుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అనంతరం డ్రైవర్ కారును పోలీసుల స్వాధీనం చేసుకొన్నారు. br సందీప్ ఔర్ పింకీ ఫరార్ అనే చిత్రంలో అర్జున్ కపూర్ పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. చాలా కఠినమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ పొందాడు. ఈ చిత్రంలో హై ప్రొఫైల్ నేరస్థుల భరతం పట్టే పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అర్జున్ కపూర్ సరసన పరిణితి చోప్రా నటిస్తున్నది.


User: Filmibeat Telugu

Views: 1.6K

Uploaded: 2017-12-07

Duration: 01:08