భూతల స్వర్గంలో మిస్​ వరల్డ్​ బ్యూటీలు - ఫిల్మ్​సిటీ అందాలకు అందగత్తెలు ఫిదా

భూతల స్వర్గంలో మిస్​ వరల్డ్​ బ్యూటీలు - ఫిల్మ్​సిటీ అందాలకు అందగత్తెలు ఫిదా

Miss World contestants visit Ramoji Film City : కనువిందు చేసే కమనీయ కట్టడాలు, ఆకర్షించే ఆకృతులు, ప్రకృతి రమణీయతకు నెలవైన రామోజీ ఫిల్మ్‌సిటీలో అందాల భామలు సందడి చేశారు. ఫిల్మ్‌సిటీకి చేరుకున్న 108 మంది దేశ, విదేశాలకు చెందిన మిస్‌వరల్డ్‌ పోటీదారులకు అధికారులు, రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రతినిధులు ఎర్రతివాచిపై స్వాగతం పలికారు. తెలుగువారి సంప్రదాయపద్ధతిలో గంధం పూసి, పన్నీరు చల్లి చిత్రపురిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్‌ నేత మల్‌రెడ్డి రాంరెడ్డి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌కుమార్‌, రామోజీ గ్రూప్‌ సంస్థల సీఎండీ కిరణ్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ సీఈఓ బాపినీడు విదేశీ అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీ సైనేజ్ వద్ద గ్రూప్ ఫోటోషూట్‌తో సుందరీమణులు సందడి చేశారు. అనంతరం పర్యాటక నగరిలో ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-05-18

Duration: 03:33