నంద్యాల నుంచి బాబు, లోక్‌సభకు బాలయ్య : దగ్గుబాటి పురందేశ్వరి కి హిందూపురం లోక్ సభ | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2017-11-06

627 Views

02:48

AP CM Chandrababu Naidu will be contested from Nandyal in next assembly elections. Because Nara Lokesh contest will be necessary in next assembly elections. In this context Chandrababu own assembly seat 'Kuppam' in Chithoor District will be safe for Nara Lokesh.
వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు రాయలసీమ వాసులకు కొత్త ముఖాలను పరిచయం చేయనున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటున్న వారితోపాటు వారి వారసులు, కుటుంబ సభ్యులు బరిలోకి దిగడమే కాదు.. కొందరు వెనక్కు తగ్గి మరి కొందరు ముందుకు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. చివరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్థల మార్పును కోరుకుంటున్నారని వినికిడి. ముందుగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చేసి తర్వాత కొడుకు నారా లోకేశ్‌ను తన క్యాబినెట్ లోకి తీసుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తనయుడిని కూడా ఎన్నికల బరిలోకి దించాల్సిన అవసరం ఉన్నది. పలు నియోజకవర్గాలను పరిశీలనలోకి తీసుకున్నా సొంత సామాజిక వర్గం జనాభా గట్టిగా ఉన్న నియోజకవర్గాలను బాబు పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం. అలా కానీ పక్షంలో కుప్పుం నుంచే నారా లోకేశ్‌ను రంగంలోకి దించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Trending Videos - 5 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 5, 2024