Rajinikanth political entry : కాబోయే CM పాత CM పేరు ఎత్తలేదు! వ్యూహమేనా ?

By : Oneindia Telugu

Published On: 2017-12-30

351 Views

12:08

Rajinikanth meetings with fans. Former matinee idol and late Chief Minister M G Ramachandran was still living in the people's hearts because of his characteristics, top actor Rajinikanth said here on saturday in Chennai.


అభిమానులతో గత ఐదు రోజుల నుంచి వరుసగా భేటీ అయ్యి వారితో ఫోటోలు తీసుకుంటున్న రజనీకాంత్ రాజకీయాల గురించి మాట్లాడిన సమయంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ పేర్లు మాత్రమే చెప్పారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరును ఎక్కడా ప్రస్తావించకుండా రజనీకాంత్ జాగ్రత పడ్డారు.

తమిళ సీనీరంగంలో ఒక వెలుగు వెలిగిన అలనాటి ప్రముఖ నటుడు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), శివాజీ గణేశన్‌ ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని రజనీకాంత్ గుర్తు చేశారు.రెండు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంజీ రామచంద్రన్, సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శివాజీ గణేశన్ లోని గుణగణాలే తమిళ ప్రజల హృదయాల్లో శాస్వతంగా నిలిచిపోవడానికి కారణమని రజనీకాంత్ గుర్తు చేశారు.

తాను నటుడిగా ఎదిగే సమయంలో శివాజీ గణేశన్‌ తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పిన రజనీకాంత్ ఇదే సందర్బంలో ఆ అనుభవాలను అభిమానులకు వివరించారు. సినీరంగంలో ఉంటూనే ఎంజీఆర్, శివాజీ గణేశన్ తమిళనాడులో ప్రజాసేవ చేశారని ఇదే సందర్బంలో రజనీకాంత్ చెప్పారు.

Trending Videos - 1 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 1, 2024