Anushka on Prabhas : Don't Expect Romance from me and Prabhas

By : Filmibeat Telugu

Published On: 2018-02-08

1.1K Views

01:57

When Anushka Shetty was asked her wedding rumours with Prabhas, she bluntly replied, "Prabhas and I are not getting married. Please do not expect Baahubali and Devasena like chemistry in real life. It is only for off screen."

ప్రభాస్, అనుష్క వెండితెరపై చూడముచ్చటైన జంట. మిర్చి, బాహుబలి, బాహుబలి 2 లాంటి చిత్రాల్లో వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఎంతలా అంటే ఆడియన్స్ సైతం ఈ జంట రియల్ లైఫ్‌లో కూడా భార్య భర్తలు అయితే బావుండు అని కోరుకునేంతగా. ఆ మధ్య ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ కూడా చాలా వచ్చాయి. అయితే అనుష్క పలు సందర్భాల్లో వీటిని ఖండించింది.
తన తాజా చిత్రం ‘భాగమతి' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క..... అక్కడ ప్రభాస్ గురించిన ప్రశ్న ఎదురవ్వగానే సహనం కోల్పోయారు. అగ్రహంగా సమాధానం ఇచ్చారు. తరచూ ప్రభాస్‌తో పెళ్లి అనే ప్రశ్న ఎదురవుతుండటంతో ఆమె విసుగుచెంది ఇలా ప్రవర్తించినట్లు స్పష్టమవుతోంది.
ప్రభాస్, నేను పెళ్లి చేసుకోవడం లేదు. దయచేసి బాహుబలి, దేవసేన రొమాన్స్ రియల్ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయవద్దని, నిజ జీవితంలో అది వర్కౌట్ కాదు అని ఈ సందర్భంగా అనుష్క కోరారు.తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, పెళ్లి చేసుకోవడం లేదని ఎన్నిసార్లు చెప్పినా మీడియా పదే పదే ఇదే విషయం అడిగి ఎందుకు విసిగిస్తున్నారు అంటూ అనుష్క మండి పడ్డారు.
ప్రభాస్, నేను మంచి స్నేహితులం. మా ఇద్దరి మధ్య స్నేహాన్ని మించి మరేమీ ఊహించుకోవద్దు. మేము పెళ్లి చేసుకోవడం అనేది ఎప్పటికీ జరుగదు అని అనుష్క తేల్చి చెప్పారు.ప్రభాస్ కూడా ఇటీవల తన పెళ్లి వార్తలను ఖండించారు. తనకు ఇప్పుడు అలాంటి ఆలోచన లేదని, తన దృష్టంతా సినిమాల మీదనే ఉందని ప్రభాస్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Trending Videos - 12 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 12, 2024