Naa Nuvve Audio Launch.. Tamanna,Kalyan Ram Speech

By : Filmibeat Telugu

Published On: 2018-05-07

700 Views

01:49

Kalyan Ram and Tamannaah speech at Naa Nuvve audio launch. Naa Nuvve will going to release May last week
#NaaNuvve
#KalyanRam
#Tamannaah

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం నా నువ్వే. మే చివరి వారంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తాజగా ఈ చిత్ర ఆడియో వేడుక ఘనంగా జరిగింది. 180 చిత్రంతో మంచి గుర్తింపు పొందిన జయేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. కళ్యాణ్ రామ్ సరసన మిల్కి బ్యూటీ తమన్నా తొలి సారి నటించింది. ఈ చిత్ర ఆడియో వేడుకలో తమన్నా, కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ ప్రేమ కథలో నటించడం ఇదే తొలిసారి.
రియల్ లైఫ్ లో ఆర్జేగా ఉండడం చాలా కష్టం అని తమన్నా తెలిపింది. ఈ చిత్రం ద్వారా తనకు ఆ విషయం తెలిసిందని మిల్కి బ్యూటీ అభిప్రాయపడింది. నా నువ్వే చిత్రంలో తమన్నా ఆర్జే మీరాగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో సాంగ్ చిత్రీకరిస్తున్న సమయంలో తనకు తీవ్ర జ్వరంతో ఉన్నానని, కళ్యాణ్ రామ్ లాంటి కో స్టార్ లేకపోతే ఆ సాంగ్ నేను చేసేదాన్ని కాదని తమన్నా తెలిపింది. కెమెరామెన్ పిసి శ్రీరామ్ సహకారం కూడా మరిచిపోలేనిది అభిప్రాయ పడింది.
దర్శకుడు జయేంద్ర తనకు రొమాంటిక్ లవ్ స్టోరీ వివరిస్తానని చెప్పినప్పుడు తాను ఆశ్చర్యపోయానని కళ్యాణ్ రామ్ అన్నారు. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్న తనకు రొమాంటిక్ స్టోరీ ఏంటని అనుకున్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపారు.
ఈ చిత్ర ఫస్ట్ డే షూట్ లోనే తమన్నాతో రొమాంటిక్ సాంగ్ చేయవలసి వచ్చింది. అప్పటివరకు తమన్నాతో కనీసం పరిచయం కూడా లేదు. అలాంటిది అప్పుడే రొమాంటిక్ సాంగ్ ఏంటి.. నేను చేయనని నిర్మాతకు చెప్పా అని కళ్యాణ్ రామ్ అన్నారు. కానీ చేయవలసిందే అని వారు కోరడంతో చినికి చినికి అనే సాంగ్ చేసానని, తమన్నా సపోర్ట్ లేకుండా చేసే వాడిని కాదని కళ్యాణ్ రామ్ అన్నాడు.

Trending Videos - 3 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 3, 2024