Sachin Tendulkar launches cricket academy

Sachin Tendulkar launches cricket academy

br భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ త్వరలో క్రికెట్ అకాడమీని ప్రారంభించబోతున్నాడు. మిడిలెసెక్స్‌ క్రికెట్‌తో కలిసి 'టెండూల్కర్ మిడిలెసెక్స్‌ గ్లోబల్‌ అకాడమీ (టీఎంజీఏ)'ను ప్రారంభించబోతున్నట్లు సచిన్‌ బుధవారం తెలిపాడు. ఇద్దరి సంయుక్త భాగస్వామ్యంలో రూపొందనున్న ఈ అకాడమీకి టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ క్రికెట్ అకాడమీ (టీఎమ్‌జీఏ)గా నామకరణం చేశారు. br ఈ అకాడమీ ద్వారా 9 నుంచి 14 ఏళ్ల వయస్సులోపు బాలబాలికలకు సచినే స్వయంగా శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరగనున్న శిక్షణ కార్యక్రమాలను మొదటి క్రికెట్‌ క్యాంపులోభాగంగా వచ్చే నెల 6 నుంచి లండన్‌లోని నార్త్‌వుడ్‌లో ఉన్న మర్చంట్‌ టేలర్స్‌ స్కూల్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత లండన్, ముంబైలకు కూడా దీనిని విస్తరించనున్నారు. మిడిలెసెక్స్‌లోని ప్రొఫెషనల్ కోచ్‌లు పూర్తిస్థాయి సమగ్ర శిక్షణ కరికులమ్‌ను రూపొందించారు.


User: Oneindia Telugu

Views: 14

Uploaded: 2018-07-19

Duration: 01:28

Your Page Title