Union Minister Ananth Kumar : కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కన్నుమూత | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2018-11-12

3 Views

01:41

కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు అనంత్ కుమార్ (59) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తులకి సంబంధించిన క్యాన్సర్ వ్యాధికి బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం అర్దరాత్రి దాటాక సుమారు 1.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన అనంతకుమార్ అక్టోబర్ 20 న ఇండియాకు తిరిగివచ్చారు. ఆ తరువాత బెంగళూరులోని శంకర్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అనంతకుమార్ 1959 జులై 22న బెంగళూరులో జన్మించారు. ప్రస్తుతం కర్ణాటక బీజేపీకి అధ్యక్షునిగా ఉన్న అనంతకుమార్ 6 సార్లు సౌత్ బెంగళూరు స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేంద్ర మంత్రి పదవి చేపట్టారు.
#AnanthKumar
#NarendraModi
#Unionminister
#Bengaluru
#Karnataka
#bjp

Trending Videos - 30 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 30, 2024