ICC Cricket World Cup 2019:BCCI Wants Selectors To Throw Light On 'No.4' Fiasco After World Cup Exit

By : Oneindia Telugu

Published On: 2019-07-13

394 Views

02:17

ICC Cricket World Cup 2019:India left out of World Cup 2019 after suffering defeat against New Zealand in a rain-affected semi-final on Wednesday. Chasing 240 to win the first semifinal, India was dismissed for 221 with three balls remaining at Old Trafford.
#icccricketworldcup2019
#msdhoni
#viratkohli
#jaspritbumrah
#engvnz
#cricket

ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో సెమీస్ నుంచే వెనుదిరిగిన టీమిండియాకు కష్టాలొచ్చిపడ్డాయి. ముఖ్యంగా కోచ్ రవి శాస్ర్తీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ విమర్శలకు సమాధానాలు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. వీరికి ఇప్పుడు మరో అదనపు సమస్య ఎదురుకానుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) పాలనాధికారుల బృందం (సీఓఏ) త్వరలోనే కోచ్, కెప్టెన్‌తో సమావేశమై, వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై వివరణను కోరనుంది. తదుపరి టోర్నీలు, సిరీస్‌లకు భారత జట్టును ఎంపిక చేయడంపై ఈ సమావేశం ప్రభావం తప్పకుండా ఉంటుందని అంటున్నారు. వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడిన తీరుతోపాటు ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనపై కూడా సుప్రీం కోర్టు నియమించిన సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్, సభ్యులు డయానా ఎడుల్జీ, లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) రవి థోడ్గే దృష్టి సారించనున్నట్టు సమాచారం. అదే విధంగా జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌తోనూ వీరు చర్చలు జరిపి, వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తారని తెలుస్తోంది. భారత జట్టు కోచ్, కెప్టెన్ స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే వారితో వరల్డ్ కప్ రివ్యూ మీటింగ్ ఉంటుందని, రాబోయే కాలంలో టీమిండియా కూర్పు గురించి సెలక్షన్ కమిటీతో చర్చిస్తామని వినోద్ రాయ్ పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు.

Trending Videos - 30 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 30, 2024