2.Maranam Nanu varinchi Vaste Yemantaanu_TELUGU GAZALS_DR.C.NARAYANA REDDY_

2.Maranam Nanu varinchi Vaste Yemantaanu_TELUGU GAZALS_DR.C.NARAYANA REDDY_

br br మరణం నను వరించి వస్తే br యేమంటాను నేనేమంటాను br పాలుపట్టి జోలపాడి పడుకోమంటాను br br లంచం నను భజించి వస్తే br యేమంటాను నేనేమంటాను br తిరుమలగిరి హుండిలో చొరపడమంటాను br br కామం నను కలవర పెడితే br యేమంటాను నేనేమంటాను br అలిగిఉన్న పడుచు జంటతో కలపడమంటాను br br క్రోధం నను కవ్విస్తుంటే br యేమంటాను నేనేమంటాను br పసచచ్చిన పేడిజాతిలో బుసలిడమంటాను br br లోభం నను ఉలిపిస్తుంటే br యేమంటాను నేనేమంటాను br తెగవొలికే కవిపలుకుల్లో దిగబడమంటాను br br అహంకారమెదురై వస్తే br యేమంటాను నేనేమంటాను br నరునివదలి కొండనెత్తిలో స్థిరపడమంటాను br br కాలం పులిలా గాండ్రిస్తే br యేమంటాను నేనేమంటాను br దిగులెందుకు ఓయిసినారే తెగపడమంటాను


User: Sudarshan Reddy

Views: 19

Uploaded: 2017-08-11

Duration: 00:23

Your Page Title