శకలక శంకర్ హీరోగా ‘డ్రైవర్ రాముడు’..ఫస్ట్ లుక్ సూపర్..

శకలక శంకర్ హీరోగా ‘డ్రైవర్ రాముడు’..ఫస్ట్ లుక్ సూపర్..

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమైన శకలక శంకర్ తర్వాత సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తూ వరుస అవకాశాలతో దూసుకెలుతున్నాడు. తాజాగా శకలక శంకర్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి 'డ్రైవర్ రాముడు' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. రాజ్ స‌త్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ పతాకం పై మాస్టర్ రాజ్ ప్రణవ్ తేజ్ సమర్పణలో ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్ నిర్మిస్తున్నారు. పోస్టర్ కట్టుకునే విధంగా ఉండటంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. br ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ... ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించిన శంక‌ర్‌లో మ‌రో కొత్త కొణం ఈచిత్రం ద్వారా చూపించబోతున్నాం. శంక‌ర్ మార్క్ కామెడీ ఉంటూనే ఈ చిత్ర కథ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది అని తెలిపారు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2017-10-26

Duration: 01:25

Your Page Title