Ind Vs NZ 3rd ODI : India Won By 6 runs | Oneindia Telugu

Ind Vs NZ 3rd ODI : India Won By 6 runs | Oneindia Telugu

మూడు వన్డేల సిరిస్‌ను భారత్ గెలుచుకుంది. కాన్పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరిస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. ఈ సిరిస్ విజయం భారత్‌కు వరుసగా ఏడో సిరిస్ విజయం కావడం విశేషం. 338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలో దూకుడుగా ఆడినప్పటికీ చివర్లో తడబడింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 15 పరుగులు సాధించాల్సిన దశలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. br బుమ్రా ఇన్నింగ్స్ 47 ఓవర్లో ధోనితో చక్కటి సమన్వయంతో లాథమ్ (65)ను రనౌట్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. వాస్తవానికి కివీస్ జట్టు 40 ఓవర్లలో 2473తో పటిష్టంగా కనిపించింది. లాథమ్ క్రీజులో ఉన్నంత సేపు భారత్ విజయానికి దూరంగా ఉండిపోయింది. చివర్లో కివిస్ విజయానికి 13 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో అతడు రనౌట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్‌లో బుమ్రా మ్యాజిక్ చేయడంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకముందు టాస్ గెలిచిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 329

Uploaded: 2017-10-30

Duration: 04:18

Your Page Title