Dhoni VS T20 : ధోని ఆట తీరు మారాలి : లక్ష్మణ్‌ అభిప్రాయంతో విభేదించిన సెహ్వాగ్‌ | Oneindia Telugu

Dhoni VS T20 : ధోని ఆట తీరు మారాలి : లక్ష్మణ్‌ అభిప్రాయంతో విభేదించిన సెహ్వాగ్‌ | Oneindia Telugu

Former India opener Virender Sehwag on Monday (November 6) advised Mahendra Singh Dhoni to get going from ball one while chasing big totals and asked the Indian team management to brief the under-pressure player about his role in the T20 team. br టీ20ల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆట తీరు మారాలని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ ధోనికి చెప్పాలని సెహ్వాగ్ సూచించాడు. రాజ్ కోట్ వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టీ20లో ధోని 37 బంతుల్లో 49 పరుగులు చేసిన నేపథ్యంలో అతడి ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సెహ్వాగ్ పైవ్యాఖ్యలు చేశాడు. 'టీ20ల్లో ధోని తన పాత్ర ఏంటో తెలుసుకోవాలి. భారీ లక్ష్యాన్ని ఛేదించేటపుడు ధోని ఆరంభం నుంచే పరుగులు తీయాలి. తొలి బంతి నుంచే ధాటిగా ఆడాలి. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం అతడికి అర్థమయ్యేలా చెప్పాలి' అని సెహ్వాగ్ అన్నాడు.


User: Oneindia Telugu

Views: 701

Uploaded: 2017-11-07

Duration: 01:38

Your Page Title