"గరుడ వేగ" నిర్మాత ఎక్కడ ? ఆ విభేదాలే కారణమా?

"గరుడ వేగ" నిర్మాత ఎక్కడ ? ఆ విభేదాలే కారణమా?

Why Garuda Vega Producer Koteswara Raju skips Success Meets br br గత వారం రోజులుగా టాలీవుడ్ టాప్ టాక్స్ లిస్ట్‌లో మొదట ఉన్నది 'గరుడవేగ' సినిమానే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఐతే ఈ టాక్‌కు తగ్గట్లుగా ఈ సినిమా వసూళ్లు లేకపోవడం చిత్ర బృందానికి నిరాశ కలిగిస్తున్న విషయం. br రివ్యూలు బాగున్నాయి. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. అయినా ఏం లాభం.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. br దీనికి ముఖ్య కారణం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరక్కపోవడమే. ఈ చిత్రాన్ని కేవలం 300 థియేటర్లలోనే రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమాకు మంచి థియేటర్లు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. br రెండో రోజు నుంచి థియేటర్లు, షోలు పెంచినా.. అవి సరిపోలేదు. దీంతో టాక్ కు తగ్గట్లుగా వసూళ్లు రాలేదు. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు గరుడ వేగ టీమ్ చేస్తున్న సక్సెస్ మీట్‌లలో ఈ సినిమా నిర్మాత కోటేశ్వరరాజు మాత్రం ఎక్కడా కనిపించలేదు. br ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాత్రం ఒకసారి అలా వేదిక మీదికి వచ్చి రాజశేఖర్ పక్కన కనిపించాడు. ఆ వేడుకలో ఆయన ఎక్కడా లీడ్ తీసుకున్నది లేదు. ఈ సినిమాపై ఏకంగా పాతిక కోట్లకు పైగా ఖర్చు పెట్టిన నిర్మాత ఎందుకు లైమ్ లైట్లోకి రావడం లేదన్నది అర్థం కావడం లేదు.


User: Filmibeat Telugu

Views: 1.4K

Uploaded: 2017-11-10

Duration: 01:26

Your Page Title