CM KCR Excellent Speech Over World Telugu Conference | Oneindia Telugu

CM KCR Excellent Speech Over World Telugu Conference | Oneindia Telugu

During the assembly sessions Telangana CM KCR explained about World Telugu Conference-2017 br br భాషపై ఉన్న పట్టుతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ అంతటి వాక్చాతుర్యాన్ని సంపాదించారన్నది సుస్పష్టం. సామెతలైనా.. నుడికారాలైనా.. పిట్ట కథలైనా సందర్భానుసారం ప్రసంగాల్లో ఉపయోగించడంలో.. ప్రజలకు కమ్యూనికేట్ చేయడంలో ఆయన ధిట్ట. కేసీఆర్ భాష ఔన్నత్యాన్ని మరోసారి తెలియజెప్పే సన్నివేశం అసెంబ్లీలో చోటు చేసుకుంది. వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తుండటంతో.. సీఎం అసెంబ్లీలో దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాష చరిత్రను, దాని గొప్పతనాన్ని ఆయన తెలియజెప్పారు. br తెలంగాణ భాష ప్రాభవం గురించి కేసీఆర్ సభలో వివరించారు. ఈ సందర్భంగా హాలుడు రచించిన 'గాధా సప్తశతి'లోని పద ప్రయోగాల గురించి అనర్గళంగా మాట్లాడారు. 'తెలంగాణలో పరిఢవిల్లిన సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాలన్న ఆశయంతో ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. సంగీతాత్మకమైన భాషగా, సుసంపన్న సాహిత్య వారసత్వం ఉన్న భాషగా తెలుగు భాష కీర్తి పొందింది. నికోలస్ కోర్టీ అనే పాశ్చాత్య పండితుడు తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'గా కొనియాడారు.' అని తెలిపారు.


User: Oneindia Telugu

Views: 10

Uploaded: 2017-11-17

Duration: 01:49

Your Page Title