India vs Sri Lanka Test Series : Pitches For Spinners Or Pacers | Oneindia Telugu

India vs Sri Lanka Test Series : Pitches For Spinners Or Pacers | Oneindia Telugu

The pitches at Nagpur's Vidarbha Cricket Stadium and Delhi's Feroze Shah Kotla, which are being readied to host the second and third Tests between India and Sri Lanka, are to be green and bouncy br br ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు చివరి వరకు ఉత్కంఠగా సాగి డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన విజయం సాధించాల్సి ఉన్నప్పటికీ కోల్‌కతా క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు తీసుకున్న ఓ నిర్ణయం దానిని దూరం చేసిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. br నిజానికి ఉపఖండం పిచ్‌లు స్పిన్నర్లకు స్వర్గధామాలు. అలాంటిది కోల్‌కతా టెస్టులో భారత స్పిన్నర్లు ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు. అంతేకాదు స్వదేశంలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోడవం ఇదే తొలిసారి.గతంలో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌‌ను గంగూలీ బౌలర్లకు అనుకూలంగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిచ్ అనుకూలత స్పిన్నర్ల కంటే పేసర్లకే ఎక్కువగా ఉపయోపడింది. వచ్చే ఏడాది కోహ్లీసేన వరుసగా దక్షిణాఫ్రికాతో పాటు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లలో బౌన్సీ పిచ్‌లు కావడంతో అందుకు సన్నాహకంగా ఈడెన్ పిచ్‌ను తీర్చిదిద్దారు.


User: Oneindia Telugu

Views: 15

Uploaded: 2017-11-22

Duration: 01:49

Your Page Title