Bruce Lee Lost Life? Long Time Mystery Solved! బ్రూస్ లీ మరణ రహస్యం ! | Oneindia Telugu

Bruce Lee Lost Life? Long Time Mystery Solved! బ్రూస్ లీ మరణ రహస్యం ! | Oneindia Telugu

How did bruce lee really Lost life : long time mystery solved br br అతని పంచ్ పవర్ మామూలుగా ఉండేది కాదు. ఒక రేంజ్ లో ఉండేది. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మన్ గా పేరుగాంచాడు. అతనే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బ్రూస్ లీ. చాలా తక్కువ కాలంలో వరల్డ్ వైడ్ గా ఖ్యాతి సాధించిన ఇతను అర్ధాంతరంగా ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయాడు. ఇతను చనిపోయిన చాలా కాలమైనా ఆ మరణానికి సంబంధించిని మిస్టరీస్ ఇప్పటికీ చాలానే వినపడుతుంటాయి. పీడ్ ఫైటింగ్ టెక్నిక్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న బ్రూస్ లీ 32 ఏళ్లకే చనిపోయాడు. ఈ మార్షల్ ఆర్టిస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒకసారి చూద్దాం. br నవంబర్ 27, 1940 జన్మించి జులై 20, 1973 వరకు ఉన్న బ్రూస్ లీ గురించి ప్రంపంచం మొత్తం తెలుసు. ఈయన అమెరికాలో జన్మించి హాంకాంగ్ లో పెరిగారు. బ్రూస్‌ లీ తన చిన్నతనంలో ఆత్మరక్షణ కోసం తండ్రి దగ్గర నుంచి థామ్‌ చీ చువాన్‌ అనే యుద్ధ విద్యను నేర్చుకున్నారు. కుంఫులో భాగమైన వింగ్‌ చున్‌ లో శిక్షణ కోసం ఇప్‌మెన్‌ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తరువాత బాక్సింగ్, డాన్సింగ్, కత్తి సాముల్లో నైపుణ్యం సాధించాడు. 18 ఏళ్ల వయస్సులోనే వీటన్నింటిని నేర్చుకున్నాడు బ్రూస్ లీ. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఒక పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆబ్జెక్ట్‌కు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు.


User: Oneindia Telugu

Views: 118

Uploaded: 2017-11-30

Duration: 03:38

Your Page Title