Gujarat Elections Polling : More Than 30% Polling Till Noon | Oneindia Telugu

Gujarat Elections Polling : More Than 30% Polling Till Noon | Oneindia Telugu

Gujarat Assembly Elections: Voting underway in first phase, More than 30 polling recorded till noon. catch us for more updates. br br దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన గుజరాత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 182 స్థానాలకు గానూ.. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్‌, కచ్‌ ప్రాంతాల్లోని 89 స్థానాలకు శనివారం తొలివిడుత పోలింగ్‌ జరుగుతుంది. తొలి విడత ఎన్నికల బరిలో గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపాని సహా 977 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 2.11 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈనెల 14న మిగిలిన స్థానాలకు రెండో విడతలో పోలింగ్‌ జరగనుంది. br భారత జట్టు క్రికెటర్ ఛటేశ్వర్ పూజారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్‌కోట్ లోని రావి విద్యాలయ బూత్‌లో ఆయన ఓటు వేశారు. కొత్తగా పెళ్లయిన ఓ జంట తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భరుచ్ బహుమాలి భవనంలో వారు ఓటేశారు. ఇక 11గం.కల్లా 20శాతం పోలింగ్! నమోదు అయినట్టు సమాచారం. ఉదయం 10గం. వరకు 9.77శాతం పోలింగ్ నమోదైంది.


User: Oneindia Telugu

Views: 390

Uploaded: 2017-12-09

Duration: 01:42

Your Page Title