సినిమా హాళ్లలో 'నో ' జాతీయ గీతం

సినిమా హాళ్లలో 'నో ' జాతీయ గీతం

The Supreme Court has accepted the centre's suggestion that the playing of national anthem before the screening of movies should not be made compulsory. br br సినిమా హాళ్లలో జాతీయ గీతం తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు తెలిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించింది. 2016 నవంబర్ 30వ తేదీన సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి అని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. br దీంతో అప్పటి నుంచి సినిమా హాళ్లలో దీనిని ఆలపిస్తున్నారు. ఈ అంశంపై కేరళకు చెందిన ఓ సంస్థతో పాటు పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇప్పుడు న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించింది. సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేయడంపై విమర్శలు కూడా వచ్చాయి. కేంద్రం కూడా దీనిని పునఃపరిశీలించాలని సుప్రీం కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. br థియేటర్లలో సినిమాకు ముందు జాతీయగీతం తప్పనిసరిగా వేయాలనీ, ప్రేక్షకులు కచ్చితంగా లేచి నిలబడాలని గత నవంబరు 30న జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనమే తీర్పునిచ్చింది. తాజాగా, కోర్టు ఉత్తర్వుల ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించలేమనీ, అది తల్లిదండ్రులు, గురువులు చేయాల్సిన పని అని సుప్రీంకోర్టు పేర్కొంది.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2018-01-09

Duration: 01:45