IPL Auction 2018 : Unexpected Unsold Players

IPL Auction 2018 : Unexpected Unsold Players

IPL Auction 2018 : Unexpected Unsold Players list here br br బెంగళూరు వేదికగా శనివారం (జనవరి 27)న ఐపీఎల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలం మార్నింగ్ సెషన్‌లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. బెన్ స్టోక్స్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 12.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. br అయితే వేలంలో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన అంశం ఏమిటంటే వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌ను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం. ఇక, కర్ణాటకకు చెందిన బ్యాట్స్‌మెన్లు కేఎల్ రాహుల్, మనీష్ పాండే ఈసారి వేలంలో అత్యధిక ధర పలికిన స్వదేశీ ఆటగాళ్లుగా నిలిచారు. br కేఎల్ రాహుల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 11 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా, మనీష్ పాండే కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 11 కోట్లు వెచ్చించింది. శనివారం జరిగిన ఐపీఎల్ మార్నింగ్ సెషన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాజ్ జట్టు సహా యజమాని ప్రీతి జింటా చాలా ఉత్సాహాంగా కనిపించారు. br ఈ సెషన్ పంజాబ్ ప్రాంఛైజీ రవిచంద్రన్ అశ్విన్ (రూ. 7.6 కోట్లు), యువరాజ్ సింగ్ (రూ. 2కోట్లు), ఆరోన్ ఫించ్ (రూ. 6.2 కోట్లు), కరుణ్ నాయర్ (రూ. 5.6 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 3 కోట్లు-రైట్ టు మ్యాచ్)లను వేలంలో కొనుగోలు చేసింది. ఇక, గంభీర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రూ. 2.6 కోట్లకు దక్కించుకుంది.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2018-01-27

Duration: 09:39

Your Page Title