Shriya Clarifies Her wedding Rumours

Shriya Clarifies Her wedding Rumours

Shriya and Shriya’s mother, Neerja has finally given a clear clarity on Shriya marriage news. She emphasized that Shriya is not getting married as it’s speculated. She also requested fans not to believe in such fake news. br br హీరోయిన్ శ్రీయ వివాహం జరుగబోతోందంటూ రెండు రోజులుగా మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె తన రష్యన్ బాయ్ ఫ్రెండును పెళ్లాడబోతోందని, త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి వేడుక చూడబోతున్నామంటూ వార్తలు రావడంతో అంతా నిజమే అనుకున్నారు, ఇటీవల ఆమె భారీగా నగలు, చీరలు కొనడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిఇచ్చాయి. ఈ వార్తలపై తాజాగా శ్రీయ క్లారిటీ ఇచ్చారు. br అయితే మీడియాలో తన పెళ్లి గురించి వార్తలు రావడంపై శ్రీయ స్పందించారు. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, దానికి ఇంకా చాలా సమయం ఉందని తెలిపారు. br తన స్నేహితురాలి వివాహం ఉండటంతో నగలు ఆర్డర్ ఇచ్చానని, చీరలు కొనుగోలు చేశానని, చాలా మంది ఇవి నా వివాహం కోసం అని పొరపాటు పడ్డారని శ్రియ వివరణ ఇచ్చారు. br శ్రీయ తల్లి నీరజ స్పందిస్తూ... తన కూతురు పెళ్లి వార్తలను తోసిపుచ్చారు. అందులో నిజం లేదన్నారు. రాజస్థాన్లో శ్రీయ స్నేహితురాలి వివాహం జరుగబోతోందని, అందుకే నగలు, చీరలు ఆర్డర్ చేసినట్లు నీరజ తెలిపారు. br మార్చి నెలలో తమ బంధువుల వివాహ వేడుకలతో పాటు, శ్రీయ స్నేహితుల వివాహాలు ఉన్నాయని, వాటికి తాము హాజరవుతున్న నేపథ్యంలోనే నగలు, చీరలు కొనుగోలు చేసినట్లు శ్రీయ తల్లి నీరజ వెల్లడించారు. br శ్రీయ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం ఆమె కోలీవుడ్లో కార్తీక్ నరేన్ మూవీ ‘నరగాసూరన్' చిత్రంలో నటిస్తోంది. తెలుగులో శ్రీయ నటించిన ‘గాయిత్రి' చిత్రం ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు ఆమె ప్రకాష్ రాజ్ బాలీవుడ్ మూవీ ‘తడ్కా' చిత్రంలోనూ నటిస్తోంది.


User: Filmibeat Telugu

Views: 876

Uploaded: 2018-02-07

Duration: 01:18