AP Bandh : Left Parties Call For Bandh Over 'Anti-People Budget'

AP Bandh : Left Parties Call For Bandh Over 'Anti-People Budget'

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu responded on AP bandh on Wednesday. The Left Parties have called for a bandh in Andhra Pradesh on Thursday for the raw deal the state received in the recent budget. br br కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు గురువారం ఏపీ బందుకు పిలుపునిచ్చాయి. ఈ బందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. బందుపై సీఎం చంద్రబాబు స్పందించారు. బందు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్సులో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఎంపీలు పార్లమెంటులో పోరాడుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులపై మన పోరాటం ఏపీలో కాదని, ఢిల్లీలో ఉండాలన్నారు. br ఏపీ బందుకు పిలుపునివ్వడంపై మంత్రులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద బాబు స్పందించారు. పోరాటం న్యాయమైనదేనని, కానీ ఈ అంశంపై పార్లమెంటులో తమతో కలిసి రావాలని అన్నారు. నవ్యాంధ్ర మూడున్నరేళ్ల చంటిబిడ్డ అని, చిన్న పిల్లలను ఎలా చూసుకుంటారో ఈ రాష్ట్రాన్ని అలా చూసుకోవాలన్నారు br రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రులు చెప్పారు. ప్రపంచం అంతా మనవైపు చూస్తున్న తరుణంలో ఈ ప్రతిష్టను ఇంకా పెంచుకోవాలన్నారు. విభజన చట్టంలోని హామీలను ఒక పద్ధతి ప్రకారం సాధించుకోవాలన్నారు. ఎన్డీయేలో తాము భాగస్వాములం అయినప్పటికీ రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని, కేంద్రమంత్రులను కలుస్తూ నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. br హామీల అమలు విషయంలో కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగింది వాస్తవమే అని మంత్రులు అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడంలో జాతీయస్థాయిలో టీడీపీ ఎంపీలు విజయం సాధించారన్నారు. నష్టాల్లో ఉన్న ఏపీలో బంద్ చేస్తే మనకే నష్టమన్నారు. వామపక్షాలకు ఇక్కడ శాసన సభలో ప్రాతినిథ్యం లేకపోయినా పార్లమెంటులో వారి సభ్యులు ఉన్నందున కేంద్రంపై ఢిల్లీలో పోరాడాలన్నారు.


User: Oneindia Telugu

Views: 369

Uploaded: 2018-02-07

Duration: 02:00

Your Page Title