India vs South Africa 3rd ODI : IND Take 3-0 Lead In ODI Series

India vs South Africa 3rd ODI : IND Take 3-0 Lead In ODI Series

It wasn't just South Africa's third defeat in the series but for the third straight time, their batting showed no resilience against India's dominating wrist spin br br కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించింది. 304 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా భారత మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చాహల్‌ (446), కుల్దీప్‌ యాదవ్‌ (423), పేసర్‌ బుమ్రా (232) దెబ్బకు 40 ఓవర్లకు 179 పరుగులకు కుప్పకూలింది. br సఫారీ బ్యాట్స్‌మెన్‌లలో డుమిని (51) హాఫ్ సెంచరీ నమోదు చేయగా మిగిలివారంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 303 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో ఆరు వన్డేల సిరిస్‌లో టీమిండియా 3-0 ఆధిక్యంలో నిలిచింది. br అంతేకాదు సఫారీ గడ్డపై కోహ్లీసేన వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాలో ఒక సిరీస్‌లో మూడు వన్డేలు వరుసగా గెలిచిన భారత తొలి జట్టుగా అవతరించింది. br కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి కగిసో రబాడ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. పేసర్‌ రబాడ వేసిన ఆరో బంతిని ఎదుర్కొన్న అతడు క్లాసెన్‌ చేతికి చిక్కాడు. అంతకముందు నాలుగో బంతికి క్యాచ్‌ ఔట్‌ ప్రమాదం తప్పించుకున్నా చివరి బంతికి పెవలియన్‌కు చేరాడు. br కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి చెలరేగిపోయాడు. రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే ఓపెనర్ ధావన్‌తో కలిసి స్కోర్‌బోర్డుని పరుగులు పెట్టించాడు.


User: Oneindia Telugu

Views: 623

Uploaded: 2018-02-08

Duration: 01:28