Lavanya Tripathi Flops Journey Continues

Lavanya Tripathi Flops Journey Continues

Intteligent movie also gives bad result to Lavanya Tripathi. Her flops journey continues from Mister movie. br br సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠికి కష్టకాలం మొదలైనట్లు ఉంది. ఆమె కెరీర్ ప్రమాదంలో పడే పరిస్థితి ఎదురైంది. అందాల రాక్షసి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన లావణ్య తొలి చూపులోనే తెలుగువారికి బాగా నచ్చేసింది. ఆ చిత్రంలో అల్లరిపిల్లగా లావణ్య అద్భుతంగా నటించింది. వెంటనే కాకున్నా నెమ్మదిగా లావణ్య కోసం దర్శక నిర్మాతలు ఎగబడ్డారు. కానీ ఇప్పుడు లావణ్య పరిస్థితి పూర్తిగా చతికిల బడింది.అందాల రాక్షసి లో ఆమెని చూసి దర్శకులంతా ముచ్చట పడ్డారు. br చిత్ర పరిశ్రమలోకి వచ్చిన మూడేళ్ళ తరువాత లావణ్యకు తొలి బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది. నాని నటించిన భలేభలే మగాడివోయ్ చిత్రం ద్వారా లావణ్య ఘనవిజయం అందుకుంది. ఆ చిత్రం తిరుగులేనివిజయంతో కలెక్షన్ల వర్షం కురిపించింది. br భలేభలే మగాడివోయ్ చిత్రం తరువాత లావణ్య వెంటనే మరో విజయం దక్కించుకుంది. నాగార్జున సరసన నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంతో లావణ్య లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువాత వచ్చిన అల్లు శిరీష్ చిత్రం శ్రీరస్తు శుభమస్తు చిత్రం కూడా పరవాలేదనిపించింది. br వరుణ్ తేజ్ తో నటించిన మిస్టర్ చిత్రం నుంచి లావణ్య ఫేట్ పూర్తిగా అడ్డం తిరిగిందని చెప్పొచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలయింది. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టేసింది.లావణ్య నటిస్తూ వచ్చిన చిత్రాలన్నీ మంచి అంచనాలు ఉన్న సినిమాలే. శర్వానంద్ తో నటించిన రాధా, నాగచైతన్యతో నటించిన యుద్ధం శరణం చిత్రాలు కూడా డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చాయి.


User: Filmibeat Telugu

Views: 2.1K

Uploaded: 2018-02-10

Duration: 02:00

Your Page Title