Kollywood Bachelor Revealed His Wedding Plans

Kollywood Bachelor Revealed His Wedding Plans

Actor Vishal announced his marriage. The wedding arrangements are going on. Vishal marriage will happening in January br br ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు పందెం కోడి విశాల్ కు పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి. విశాల్ నటుడిగా కొనసాగుతూనే, తమిళ రాజకీయాలపై తరచుగా స్పదిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తన వివాహం జనవరిలో జరగబోతోందని విశాల్ స్వయంగా ప్రకటించాడు. దీనితో అతడి వివాహం గురించి ఉహాగానాలు మొదలై పోయాయి. పెళ్లి కూతురు ఎవరంటూ తెగ ఆరా తీస్తున్నారు. విశాల్ మాత్రం తనకు కాబోయే భాగస్వామి ఎవరో చెప్ప కుండా సస్పెన్స్ లోకి నెట్టేశాడు. br స్వతహాగా విశాల్ కుటుంబం తెలుగువారు. కానీ తమిళనాడులో సెటిల్ అయ్యారు. ఈ పొగరైన పందెం కోడి దేనికైనా సై అనే రకం. అందుకే తమిళనాట విశాల్ చక్రం తిప్పుతున్నాడు. నడిగర్ సంఘం ఎన్నికల్లో సైతం విశాల్ కీలక పాత్ర పోషించాడు br కెరీర్ ఆరంభంలో విశాల్ కు మంచి విజయాలు దక్కాయి. పందెం కోడి చిత్రంతో విశాల్ దక్షణాది ప్రేక్షకులనిఆకర్షించాడు. ఆ తరువాత వచ్చిన భరణి, పొగరు వంటి చిత్రాలు కూడా విశాల్ కు మంచి విజయాన్ని అందించాయి. br విశాల్ కు పరాజయాలు ఎదురైనప్పటికి అదే సత్తాతో సినిమాలలో రాణిస్తున్నాడు. విభిన్న చిత్రాలతో ముందుకు వస్తున్నాడు. విశాల్ తాజాగా నటిస్తున్న చిత్రం అభిమన్యుడు. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది.


User: Filmibeat Telugu

Views: 2.3K

Uploaded: 2018-02-10

Duration: 01:34

Your Page Title