India vs South Africa 2018 6th ODI Highlights

India vs South Africa 2018 6th ODI Highlights

Kohli continued his great form in the series, scoring his 35th ODI century, as he helped India chase down the 205-run target in 32 overs with eight wickets in hand. br br టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపించాడు. మొత్తం పరుగుల లక్ష్యం 205 కాగా అందులో సగానికి పైగా పరుగులు చేసి అలవోకగా సఫారీ జట్టుపై గెలిచారు. 8 వికెట్లు, 17 ఓవర్లకు పైగానే బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. br 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మొదటి వికెట్‌గా రోహిత్ శర్మను 3వ ఓవర్లోనే కోల్పోయింది. ఐదో వన్డేలో సెంచరీ దాటి స్కోరు చేసిన రోహిత్ ఆఖరి వన్డేలో యథావిధిగా ముప్పైకి మించని స్కోరుతో 15పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఆడిన కాసేపటిలోనే రోహిత్ మూడు బౌండరీలను సాధించడం విశేషం. br మరో ఓపెనర్ గా దిగిన ధావన్ 34బంతుల్లో (18) పరుగులు చేశాడు. విరాట్‌ ఏ బౌలర్‌నూ వదలకుండా బౌండరీల మోత మోగిస్తూ 36 బంతుల్లోనే అర్ధసెంచరీ, 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు . 23 ఓవర్లకే అతడి సెంచరీ అయిపోవడం విశేషం. ఆ వందలో 17 ఫోర్లుండటం గమనార్హం. సెంచరీ తర్వాత మరింత జోరు పెంచిన విరాట్‌ ఇంకో రెండు ఫోర్లు, రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. బౌండరీల రూపంలోనే అతను 106 పరుగులను చేసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. br ఆఖరి మ్యాచ్‌ గెలవాలనుకున్న దక్షిణాఫ్రికా ఆశలపై భారత బౌలర్లు నీళ్లు చల్లారు. ఇప్పటికే ఆరు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే గెలుచుకున్న టీమ్‌ ఇండియా ఆఖరి మ్యాచ్‌లోనూ అదే పోరాటం కొనసాగించింది. బౌలర్లకు ధీటుగా బ్యాట్స్‌మెన్‌లు అదే స్థాయిలో రెచ్చిపోయి ఆడారు. చెప్పాలంటే మ్యాచ్‌ను వన్ మాన్ షో గా చేసేశాడు కోహ్లీ. br మ్యాచ్‌ ఆరంభం నుంచే భారత బౌలర్లు సఫారీ జట్టును కట్టడి చేయడానికే ప్రాధాన్యతనిచ్చారు. ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించకుండా నిలకడగా బౌలింగ్‌ చేసి వరుసగా వికెట్లను పడగొట్టారు. బౌలర్లు సమష్టిగా రాణించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50ఓవర్లలో 204పరుగులకే ఆలౌట్‌ అయింది.


User: Oneindia Telugu

Views: 105

Uploaded: 2018-02-17

Duration: 02:00

Your Page Title