India vs South Africa 1st T20 : Jasprit Bumrah's Stunning Catch

India vs South Africa 1st T20 : Jasprit Bumrah's Stunning Catch

A brilliant effort by Jasprit Bumrah while Fielding in India vs South Africa 1st T20. The incident occurred in 6.1 over when Hardik Pandya's short delivery was mistimed by David Miller. br br br జోహెన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాడు. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. సఫారీ బ్యాట్స్‌మన్ డేవిడ్‌ మిల్లర్‌ బాదిన భారీ షాట్‌ను ఆపే యత్నంలో బుమ్రా బౌండరీ లైన్‌ వద్ద చేసిన ఫీట్‌ అబ్బురపరిచింది. br టీమిండియా బౌలర్‌ హార్దిక్‌ పాండ్యా వేసిన ఏడో ఓవర్‌ తొలి బంతిని మిల్లర్‌ మిడిల్‌ అండ్‌ లెగ్‌ మీదుగా షాట్‌ కొట్టాడు. అయితే ఆ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న బుమ్రా గాల్లోకి ఎగురుతూ బంతిని పట్టుకున్నాడు. బ్యాలెన్స్‌ చేసుకునే క్రమంలో బంతిని విసిరేసి బౌండరీ లైన్‌పై పడ్డాడు. కానీ దానిని సిక్సర్‌గా థర్డ్‌ అంపైర్‌ ప్రకటించాడు. ఇటీవల క్రికెట్‌లో మార్చిన నిబంధనల ప్రకారం తొలుత ఒకసారి బౌండరీ లైన్‌ తాకి ఆపై గాల్లో క్యాచ్‌ పట్టి విసిరేసినా అది సిక్సర్‌గానే పరిగణిస్తారు. దీంతో బుమ్రా ఒకింత నిరాశకు గురయ్యాడు. అయినప్పటికీ బుమ్రా అద్భుతమైన ఫీల్డింగ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. br అయితే దాన్ని సిక్సర్‌ గా పరిగణించటం పై అబిమానులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అది సిక్స్ ఎలా అవుతుంది అని కొంతమంది అంటుంటే, మార్చిన నిబంధనల ను తిడుతూ కొంతమంది tweets చేస్తున్నారు. br ఏది ఏమయినా బుమ్రా గాల్లోకి ఎగురుతూ బంతిని పట్టుకున్నా పాపం ప్రయోజనం లేకుండా పోయింది.


User: Oneindia Telugu

Views: 1K

Uploaded: 2018-02-19

Duration: 01:24