Kalyani Priyadarshan Family Gets Emotional After Watching Hello

Kalyani Priyadarshan Family Gets Emotional After Watching Hello

Kalyani Priyadarshan about her experience with Hello movie. Emotional comments on her parents br br అఖిల్ అక్కినేని నటించిన రెండవ చిత్రం హలో. ఈ చిత్రం పరవాలేదనిపించింది. హలొ చిత్రంతో మలయాళీ క్యూట్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ టాలీవుడ్ కు పరిచయం అయింది. గ్లామర్ లో ఏమాత్రం హద్దులు దాటని ఈ భామ అందమైన హావ భావాలతో హలో చిత్రంలో అలరించింది. హలొ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా కల్యాణికి ఇప్పుడిప్పుడే అవకాశాలు మొదలవుతున్నాయి. శర్వానంద్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ లో కళ్యాణి హలొ చిత్రంలో తన అనుభవాలని పంచుకుంది. br కళ్యాణి ప్రియదర్శన్ సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. దీనితో ఆమె సినీ రంగ ప్రవేశం సులువు అయ్యిందే కానీ.. అందులో వారి ప్రమేయం లేదని అంటోంది. కళ్యాణ్ తండ్రి ప్రియదర్శన్ మలయాళంలో ప్రముఖ దర్శకుడు. ఆమె తల్లి లిస్సి అలనాటి అందాల హీరోయిన్. br కళ్యాణి ప్రియా దర్శన్ కెరీర్ పరంగా మొదటి ఛాయిస్ సినీ రంగమే అని చెబుతోంది. కానీ వెంటనే హీరోయిన్ కావాలని భావించలేదట. నటిగా రాణించగలనా లేదా అనే సందేహంతో మొదట క్రిష్ 3 సినిమా కోసం అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిందట. br కల్యాణికి ఇంటర్వ్యూల ఫోబియా ఉందట. ఎందుకంటే సెలెబ్రిటీలు చిన్న తప్పు చేసినా మీడియాలో పెద్ద గొడవగా మారుతుంది. అందువలనే ఇంటర్వ్యూలు చాలా తక్కువగా ఇస్తూ, మీడియాతో మాట్లేడేసమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుందట. br తాను సినిమాల్లోకి వస్తానంటే తన తల్లిదండ్రులు ప్రోత్సహించారని కళ్యాణి తెలిపింది. కానీ తనకు వారు ఎలాంటి సలహాలు ఇవ్వలేదట.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2018-02-20

Duration: 02:21

Your Page Title