SR NTR A Great Fan Of Sridevi

SR NTR A Great Fan Of Sridevi

Lakshmi Parvathi reveals NTR dream project with Sridevi. NTR wants to see Sridevi as Seetha role. br br శ్రీదేవి మరణ వార్త ఇప్పటికి తమకు కలగానే ఉందని కొందరు ప్రముఖులు వాపోతున్నారు. అతిలోక సుందరి మరణాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. చలాకీగా తిరుగుతున్న శ్రీదేవి అనూహ్యంగా మరణించడంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా ఆదివారం సాయంత్రమే శ్రీదేవి భౌతిక కాయం ముంబైకి చేరుకోవాలి. కానీ సవా పరీక్షల్లో జాప్యం జరగడంతో సోమవారం శ్రీదేవి భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో తీసుకురానున్నారు. శ్రీదేవి కడసారి చూపుకోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రముఖులు శ్రీదేవి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు. br శ్రీదేవి ని చివరిసారిగా చూడడానికి ముంబైలోని ఆమె నివాసం వద్ద వేలాదిగా ఆమె అభిమానులు గుమిగూడి ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లో శ్రీదేవి వందలాది చిత్రాలలో నటించి కోట్లాది మంది అభిమానులని సంపాదించారు. br శ్రీదేవి మృత దేహాన్ని ముంబై కి తీసుకుని వచ్చేందుకు దిగ్గజ వ్యాపార వేత్త అనిల్ అంబానీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రిలయన్స్ కు చెందిన 13 సీట్ల జెట్ విమానాన్ని ఆయన దుబాయ్ కు పంపారు. ఆ విమానంలోనే శ్రీదేవి పార్థివ దేహాన్ని ఇండియాకు తరలించనున్నారు. br శ్రీదేవి మృతితో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, శ్రీదేవి మధ్య పలు ఆసక్తికర విషయాలని ఆమె వెల్లడించారు. ఎన్టీఆర్ శ్రీదేవి వీరాభిమాని అని ఆమె అన్నారు. br శ్రీదేవితో ఎన్టీఆర్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన శ్రీదేవికి వీరాభిమని. శ్రీదేవితో వైదేహి అనే చిత్రం చేయాలనే ఆలోచన ఎన్టీఆర్‌లో ఉండేది. మధ్య వయసున్న సీతా రాముల కథ అది. సేత పాత్రలో శ్రీదేవిని నటింపజేయాలని ఎన్టీఆర్ భావించారు. కానీ అనివార్య కారణాల వలన ఆ సినిమా కలగానే మిగిలిపోయిందని లక్ష్మి పార్వతి అన్నారు.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2018-02-26

Duration: 01:27

Your Page Title