PNB-Nirav Modi Fraud : CBI Recovered Documents

PNB-Nirav Modi Fraud : CBI Recovered Documents

The CBI on Thursday continued its searches in connection with the $2-billion fraud in Punjab National Bank and claimed to have recovered documents related to Letter of Undertaking. Officials said the searches were carried out after information surfaced during questioning of some arrested accused and others persons. br br పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు నీరవ్ మోడీపై అమెరికా చేతులెత్తేసింది. నీరవ్ మోడీ తమ దేశంలో ఉన్నట్లు మీడియా వార్తలను బట్టి తెలుస్తోందని, అయితే దాన్ని ధృవీకరించలేమని అమెరికా విదేశాంగ శాఖ అదికార ప్రతినిధి శుక్రవారం అన్నారు. br నీరవ్ మోడీ ఆచూకీ కనిపెట్టడానికి భారత ప్రభుత్వానికి సాయం అందిస్తారా అని అడిగితే, నీరవ్ మోడీ దర్యాప్తునకు సంబంధించి భారత అధికారులకు న్యాయ సహాయం అందించే విషయం న్యాయశాఖ చూసుకుంటుందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు. br నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ జనవరి మొదటివారంలో భారతదేశం వదిలి పారిపోయారు. వారి కోసం సిబిఐ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాను వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉన్నందున విచారణ నిమిత్తం ఇండియాకు రాలేనని నీరవ్ మోడీ చెప్పారు. br నీరవ్ మోడీ అక్రమాల కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)కి చెందిన మరో అధికారిని గురువారం అరెస్టు చేశారు. సిబిఐ కస్టడీలో ఉన్నవారినే కాకుండా మరో 13 మందిని కూడా సిబిఐ అధికారులు గురువారంనాడు ప్రశ్నించారు. అరెస్టయినవారితో పాటు ఇతరులను ప్రశ్నించినప్పుడు వెలువడిన సమాచారం మేరకు మరిన్ని సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. br నీరవ్‌ మోడీ కేసుకు సంబంధించి సీబీఐ గురువారం పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది. లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌(ఎల్‌ఓయూ) ద్వారా నీరవ్‌ పలు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. br ఈ ఎల్‌ఓయూలకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని చాల్ నుంచి లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్‌కు చెందిన పత్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.ముంబై వడలా ప్రాంతంలోని ఓ చిన్న గదిలో ఆ పత్రాలను దాచినట్లు అధికారులు తెలిపారు.


User: Oneindia Telugu

Views: 174

Uploaded: 2018-03-02

Duration: 01:38

Your Page Title