అనసూయ కఠిన నిర్ణయం ..

అనసూయ కఠిన నిర్ణయం ..

Popular anchor-actor Anasuya Bharadwaj allegedly breaking a fan's phone. After this incident, Anasuya Bharadwaj deletes all her social media accounts. br అనసూయ భరద్వాజ్.... యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి ఈ రంగంలో టాప్ రేంజికి ఎదిగిన వెరీ వరీ టాలెంటెడ్ పర్సన్. తన అందం, చలాకీతనం, చిలిపి చేష్టలతో యాంకరింగుకే కొత్తసొగబులు అద్దిన బ్యూటీ. కేవలం యాంకర్‌గానే కాకుండా నటిగానూ తనను తాను నిరూపించుకుంటూ దూసుకెళుతున్నారు. ఇక అనసూయకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఏ రేంజిలో ఉండేవారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. br br సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ పలు సందర్భాల్లో తాను స్ట్రాంగ్ లేడీ అని నిరూపించుకున్నారు. ప్రశంసలు స్వీకరిస్తూనే.... ఎవరైనా తన గురించి ఏమైనా విమర్శలు చేస్తూ వారికి ఘాటుగా కౌంటర్లు ఇస్తూ తన మనో ధైర్యాన్ని చాటుకునేవారు. br br పదేళ్ల బాలుడు తన తల్లితో కలిసి వెళుతుండగా అనసూయను చూసి సెల్పీకోసం ప్రయత్నించాడు. అయితే బాలుడి పట్ల అనసూయ కఠినంగా ప్రవర్తించడం, పిల్లాడనే కనికరం కూడా లేకుండా ఫోన్ బద్దలు కొట్టడంతో ఆమెపై సోషల్ మీడియాతో విమర్శల వర్షం కురిసింది.


User: Filmibeat Telugu

Views: 884

Uploaded: 2018-03-07

Duration: 01:49