Mohammed Shami’s illicit affairs

Mohammed Shami’s illicit affairs

A report said that on Wednesday Shami's wife has reportedly claimed that the sportsman Shami is having an illicit affair. br br టీమిండియా ఆటగాడు మహమ్మద్‌ షమిపై ఆయన భార్య హాసిన్‌ జహాన్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్‌ జాహన్‌ బట్టబయలు చేశారు. పలువురి యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్‌ స్క్రీన్‌ షాట్‌లను ఆమె ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. వీటన్నిటినీ ఆమె షమీ ఫోన్‌ నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. br br తాజాగా హాసిన్‌ మీడియాతో మాట్లాడుతూ..'గత రెండేళ్ల నుంచి షమితో పాటు ఆయన కుటుంబసభ్యులు నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. అంతేకాదు నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే షమికి ఎంతో మంది అమ్మయిలతో సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం నాకు తెలియడంతో నన్ను వేధించడం మొదలుపెట్టారు' అని హసిన్‌ చెప్పారు. br br గతంలో ధర్మశాలలో టీమిండియా మ్యాచ్‌కు నన్ను తీసుకెళ్లమని షమిని కోరాను. అతడు వద్దన్నాడు. అక్కడితో ఊరుకోకుండా అక్కడి నుంచి నాకు ఫోన్‌ చేసి మరీ నన్ను తిట్టాడు. టీమిండియా ఎక్కడికి వెళ్లినా కుల్‌దీప్‌ అనే వ్యక్తి.. షమికి అమ్మాయిలను సప్లై చేస్తాడు. బీసీసీఐకి ఈ విషయం తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు'అని హాసిన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘త్వరలో షమితో పాటు ఆయన కుటుంబసభ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా' అని ఆమె తెలిపారు. షమి-హాసిన్‌ది ప్రేమ వివాహం. 2014 జూన్‌ 6న వీరు పెళ్లి చేసుకున్నారు. 2012లో ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో షమి తొలిసారి హాసిన్‌ను చూశాడు. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప.


User: Oneindia Telugu

Views: 187

Uploaded: 2018-03-07

Duration: 01:47

Your Page Title