India vs Bangladesh Match Highlights: India Win Nidahas Trophy

By : Oneindia Telugu

Published On: 2018-03-19

600 Views

02:05

India beat Bangladesh by four wickets to win the Nidahas Trophy final in Colombo on Sunday. Needing five runs off the last ball, Karthik hit a six over extra cover to keep India's T20I record against Bangladesh.

నిదహాస్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో దినేశ్ కార్తీక్ చివరి బాల్ సిక్సు కొట్టడంతో భారత్‌కు విజయం కైవసం అయింది. దీంతో నాలుగు వికెట్ల తేడాతో ట్రోఫీని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టును కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో 166పరుగులకే పరిమితం చేసి చిత్తు చేసింది.
167 పరుగుల లక్ష్యంతో పోరాడిన భారత్‌కు రోహిత్ శర్మ 42 బంతుల్లో 56పరుగులు, శిఖర్ ధావన్ (10) మెరుపు ఆరంభాన్నిచ్చారు. కానీ వెనువెంటనే ధావన్, రైనా (0) అవుటవడం స్కోరు బోర్డుపై ప్రభావం చూపింది. లోకేశ్ రాహుల్ 14 బంతుల్లో (24)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ముందుకు నడిపాడు. కానీ జట్టు స్కోరు 83 పరుగుల వద్ద రాహుల్ అవుటవడంతో రోహిత్ ఆచితూచి ఆడాడు. బంగ్లా బౌలర్లు సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరు ఆడే క్రమంలో హిట్ మ్యాన్ నజ్ముల్ ఇస్లాం బౌలింగ్‌లో మొహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అప్పటికి ఇంకా భారత్ విజయానికి 40 బంతుల్లో 69 పరుగులు అవసరం ఉంది. దీంతో భారత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో అప్పటి వరకూ మెల్లగా ఆడిన మనీశ్ పాండే (18) ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. రోహిత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ ఆరంభంలో వేగంగా ఆడినప్పటికీ చివర్లో తడబడ్డాడు. చివరి 3 ఓవర్లలో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో ముస్తాఫిజుర్ రెహమాన్ వరుసగా అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
గెలవగలమా.. అనే సందిగ్ధత నెలకొన్న పరిస్థితుల్లో క్రీజులోకి దిగిన దినేశ్ కార్తీక్ తర్వాతి ఓవర్లో వరుసగా 6,4,6,0,2,4 బాది 22 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి ఓవర్ వచ్చేసరికి భారత్ విజయ లక్ష్యానికి 12 పరుగులు దూరంలో ఉంది. సౌమ్య సర్కార్ విసిరిన ఆఖరి ఓవర్లో ఎట్టకేలకు విజయ్ శంకర్ బౌండరీ బాదడంతో సమీకరణం రెండు బంతుల్లో 5 పరుగులుగా మారింది. కానీ ఐదో బంతికి విజయ్ క్యాచ్ అవుటయ్యాడు. చివరి బంతికి దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 29) బాదిన బౌండరీ సిక్సు కావడంతో భారత్‌కు విజయం దక్కింది.

Trending Videos - 6 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 6, 2024