Ball Tampering : Warner Loses LG Contract, More Sponsors May Cancel

Ball Tampering : Warner Loses LG Contract, More Sponsors May Cancel

LG on Wednesday has opted not to renew its contract with David Warner following the ball-tampering in South Africa br br బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్‌ను ఆర్ధికంగా బాగా దెబ్బకొట్టింది. నాలుగేళ్లుగా స్పాన్సర్‌గా ఉన్న ఎల్‌జీ కూడా వార్నర్‌తో కాంట్రాక్ట్‌ను పొడగించబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం వార్నర్‌తో ఎల్‌జీ స్పాన్సర్‌షిప్ చివరి దశలో ఉంది. మరికొన్ని వారాల్లో అది ముగియనుంది. అయితే, ఈ బాల్ టాంపరింగ్ ఉదంతం వల్ల కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించకూడదని నిర్ణయించామని ఎల్‌జీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో చెప్పారు. 2014 నుంచి ఎల్‌జీకి డేవిడ్ వార్నర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. అటు క్రికెట్ ఆస్ట్రేలియాకు మేజర్ స్పాన్సర్లుగా ఉన్న వాళ్లు కూడా పలు కార్పోరేట్ సంస్ధలు తప్పుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈ ఘటనపై విచారణ పూర్తయిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సానిటేరియమ్‌లాంటి స్పాన్సర్లు చెబుతున్నాయి br ఇదే గనుక జరిగితే స్మిత్‌, వార్నర్‌‌లు భారీ మొత్తంలో నష్టపోనున్నారు. డేవిడ్ వార్నర్‌ ఆసీక్స్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, ఛానెల్‌ 9, గ్రే నికోలస్‌, మిలో, మేక్‌ మై విష్‌ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. మొత్తానికి ఈ బాల్ టాంపరింగ్ వివాదం వల్ల బ్రాండ్‌ అంబాసిడర్లగా ఉన్న సంస్థలు అన్నీ ఈ ఇద్దరితో ఒప్పందాలను రద్దు చేసుకునే యోచనలో ఉన్నాయి. స్టీవ్ స్మిత్ విషయానికి వస్తే సీఏ నుంచి మ్యాచ్‌ ఫీజుల రూపంలో మొత్తం సుమారు రూ.19.71 కోట్లను అందుకుంటున్నాడు.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2018-03-28

Duration: 01:27

Your Page Title