IPL 2018 Opening Ceremony,Celebs Set Ready To Entertain

IPL 2018 Opening Ceremony,Celebs Set Ready To Entertain

IPL 2018 CSK coach Stephen Flemming Talks to media about their preparation for the season.He informed du Plessis was dropped from the match due to a hand injury. br br తొలి మ్యాచ్ కోసం ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నామని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. శనివారం ఐపీఎల్ 11వ సీజన్‌కు తెరలేవబోతోంది. మొత్తం 51 రోజులు పాటు జరిగే ఈ ఐపీఎల్‌లో 8 జట్లు పాల్గొంటున్నాయి. 9 ప్రధాన నగరాల్లో 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. br టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ ముంబైతో పోరుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. br ‘ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం బాగా సిద్ధమయ్యాం. కొంత ఆందోళనగా ఉన్నా.. వాంఖడే స్టేడియంలో మ్యాచ్ అంటే ఓ థ్రిల్‌ ఉంటుంది. ఈ సీజన్‌లో మా జట్టు తొలి మ్యాచ్‌ వాంఖడేలోనే ఆడుతుంది. ముంబై ఇండియన్స్‌పై గెలిచి టోర్నీకి శుభారంభం ఇవ్వాలని అనుకుంటున్నాం' అని ప్లెమింగ్ అన్నాడు. br 'ఆటగాళ్లు కూడా ఈ రోజు గేమ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అనుభవం ఉన్న ఆటగాళ్లే ఈ టోర్నీలో కీలకపాత్ర పోషిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మహేంద్ర సింగ్‌ ధోని, డ్వేన్‌ బ్రావో, షేన్‌ వాట్సన్‌, హర్భజన్‌ సింగ్‌లు మా జట్టును ముందుకు నడిపిస్తారు. ఈ ఏడాది మా జట్టు ఎంతో బలంగా ఉంది' అని ఫ్లెమింగ్‌ తెలిపాడు. br ఇదిలా ఉంటే డటం లేదని ఫ్లెమింగ్‌ ఈ సందర్భంగా తెలిపాడు. ఐపీఎల్ 11వ సీజన్ తొలి మ్యాచ్‌కు గంటన్నర ముందే ఐపీఎల్ ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి.ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఐపీఎల్ 11వ సీజన్‌కు అట్టహాసంగా తెరలేవనుంది.గంటల పాటు సాగే ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు తళుక్కుమనబోతున్నారు.


User: Oneindia Telugu

Views: 48

Uploaded: 2018-04-07

Duration: 01:39

Your Page Title