IPL 2018 : IPL Runrate Of Rohith Sharma In Seasons

IPL 2018 : IPL Runrate Of Rohith Sharma In Seasons

IPl 2018 going to be held between chennai super kings & mumbai indians .Rohith sharma stood second next to virat kohli br br br మరికొద్ది గంటల్లో క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 11వసీజన్‌కు తెరలేవనుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఐపీఎల్‌లో అత్యధికంగా మూడుసార్లు టైటిల్‌ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలవగా, లీగ్‌లో ఆడిన ప్రతిసారీ కనీసం ప్లేఆఫ్‌‌కు చేరిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. br అంతేకాదు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రెండుసార్లు టైటిల్‌ సాధించి, మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. అలాంటి చెన్నై జట్టుకు ధోని నాయకత్వం వహిస్తుండగా... ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే చెన్నైపై రోహిత్‌ ప్రదర్శన పేలవంగా ఉంది. br దీంతో తొలి మ్యాచ్‌లోనైనా రోహిత్‌ శర్మ తన మెరుపులతో మెరుస్తాడా? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ రెండు జట్ల మద్య జరిగిన పోరులో రోహిత్‌ శర్మ, చెన్నైపై రెండో అత్యధిక పరుగులు(535) నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. br ఇక, ఐపీఎల్ విషయానికి వస్తే ఇప్పటివరకు 159 మ్యాచ్‌ల్లో 3037 పరుగులు చేసిన రోహిత్ శర్మ 32.61 సగటు, 130.89 స్ట్రైక్‌ రేటు నమోదు చేశారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌ల్లో రోహిత్‌ శర్మ 535 పరుగులు చేశారు. సగటు 28.15, స్ట్రైక్‌ రేట్‌ 124.12 నమోదు చేశారు.


User: Oneindia Telugu

Views: 320

Uploaded: 2018-04-07

Duration: 02:02

Your Page Title