Sridevi's Mystery Has Sensational News

Sridevi's Mystery Has Sensational News

భారత చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అతిపెద్ద షాక్ తగిలింది. అతిలోక సుందరి శ్రీదేవి అనూహ్య మరణం అందరిని షాక్ కు గురిచేసింది. వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ కు వెళ్లిన శ్రీదేవి అక్కడ బస చేసిన హోటల్ లో అనుమానాస్పద పరిస్థితుల మధ్య తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మరణం తరువాత దుబాయ్ దుబాయ్ ప్రభుత్వం పెద్ద హై డ్రామానే నడిపింది. br దీనితో అతిలోక సుందరి మృతి గురించి అనేక ఉహాగానాలు, అనుమానాలు మొదలయ్యాయి. అంతలోనే శ్రీదేవి ప్రమాదవ శాత్తు బాత్ టబ్ లో పడి మృతి చెందినట్లు దుబాయ్ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. దీనితో అనుమానాలు ఇంకా పెరిగినప్పటికీ ఆ విషయాన్ని అంతటితో సద్దుమణిగించారు. తాజాగా రిటైర్డ్ పోలీస్ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వేద భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. br జాతీయ మీడియాలో వస్తున్న కథనం ప్రకారం రిటైర్డ్ పోలీస్ అధికారి వేద భూషణ్ శ్రీదేవి మృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శ్రీదేవి మర్డర్ చేసారంటూ ఆయన వ్యాఖ్యానించారు. br ఓ వ్యక్తిని బాత్ టబ్ లో ముంచి చంపేయడం, ఆ తరువాత ఆధారాలు లేకుండా చేయడం చాలా సులభం అని ఆయన అన్నారు. తాను శ్రీదేవి మరణించిన సమయంలో ఆమె పక్క గదిలోనే ఉన్నానని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకుందామని శ్రీదేవి మరణించిన ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నించగా అనుమతించలేదని అన్నారు. br శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించినట్లు దుబాయ్ పోలీసులు ఇచ్చిన నివేదిక అర్థవంతంగా లేదని అన్నారు. వారు చెబుతున్న కారణాలు ఒక్కటి కూడా నమ్మదగినవిగా లేవని వేద భూషణ్ అన్నారు. శ్రీదేవిని ప్లాన్ ప్రకారం చంపేశారని అతడు ఆరోపిస్తున్నాడు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2018-05-19

Duration: 01:32