నిఫా ఎఫెక్ట్ తో కేరళకు షాకిచ్చిన యూఏఈ

నిఫా ఎఫెక్ట్ తో కేరళకు షాకిచ్చిన యూఏఈ

To safeguard the health of residents, the UAE has Stopped imports of fresh fruits and vegetables from Kerala, India, as well as live animals from South Africa, said officials on Tuesday. br #uae br #nipahvirus br #kerala br br వైరస్ ముప్పు భయపెడుతోంది. ఈ వైరస్ కేరళలోని కోజికోడ్, మలప్పురం జిల్లాలల్లో 12 మందిని బలి తీసుకుంది. ఈ ప్రాణాంతక వైరస్ కేరళను దాటి కర్ణాటకకు వ్యాపించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. గబ్బిలాల వల్ల విస్తరించే ఈ ఇన్‌ఫెక్షన్ జంతువుల నుంచి మనుషులకు వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఇన్‌ఫెక్షన్ బారిన పడ్డ గబ్బిలాలు, పందులు లేదా మనుషులను తాకడం ద్వారా ఇతరులకు సోకుతోంది. br 'నిఫా' వైరస్‌ కారణంగా కేరళ నుంచి తాజా కూరగాయలు, పండ్ల దిగుమతిని యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌(యుఏఈ) మంగళవారం నిషేధించింది. యుఏఈ పర్యావరణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ఇదే విషయాన్ని అబూదాబీ ఆహార నియంత్రణ ప్రాధికార సంస్థతో పాటూ దుబాయ్‌, షార్జా, అజ్‌మన్‌, రస్‌అల్‌ ఖైమా, ఫ్యుజయిరా పురపాలక సంఘాలకు ఈ మేరకు ఒక సర్క్యులర్‌ను పంపింది. br కేరళలో 'నిఫా' వైరస్‌ వ్యాప్తి వార్తల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిఫా వైరస్ కారణంగా కేరళలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు.


User: Oneindia Telugu

Views: 642

Uploaded: 2018-05-30

Duration: 01:21