Sri Reddy Comments About Actor Nani's Personal Life

Sri Reddy Comments About Actor Nani's Personal Life

SriReddy warns Natural star Nani. She made controversial comments on Pawan Kalyan and Chiranjeevi. br br పవన్ కళ్యాణ్ పై విమర్శలు కొనసాగిస్తూనే సినీ ఇండస్ట్రీలో ఉన్న మరి కొందరి ప్రముఖులపై కూడా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. కాస్టింగ్ కౌచ్ పోరాటం పేరుతో శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ముందు అర్థ నగ్న నిరసన చేసిన సంగతి తెలిసిందే. దీనితో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ గురించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తన పోరాటాన్ని అర్ధవంతమైన మార్గంలో నడిపించకుండా అత్యంత దారుణమైన వ్యక్తిగత విమర్శలకు శ్రీరెడ్డి దిగడంతో ప్రజల్లో ఉన్న సానుభూతిని కోల్పోయి వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇప్పటికే అలాంటి వ్యక్తిగత విమర్శలే శ్రీరెడ్డి చేస్తోంది. పవన్, చిరు, నాని, దగ్గుబాటి ఫ్యామిలీ గురించి వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతోంది. తాను పోరాటం చేస్తున్న వీరనారిగా చెప్పుకుంటున్న శ్రీరెడ్డి భూతు పురాణం మాత్రం విడిచిపెట్టడంలేదు. తాజాగా ఇస్తున్న యూట్యూబ్ ఇంటర్వ్యూలలో కూడా అదే పద్ధతి కనిపిస్తోంది. br అసలు శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆమె వ్యక్తిగత ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పై అర్థం లేని విమర్శలు చేస్తూ రాజకీయంగా దిగజార్చడమే తన ఉద్దేశంగా శ్రీరెడ్డి కామెంట్లు ఉన్నాయి.పవన్ ని విమర్శిస్తూ చిరుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీ అన్న ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నాడు. నమ్ముకున్నోడిని నిండా ముంచాడు అంటూ కొన్ని పేర్కొనలేని అసభ్య పదప్రయోగం చేసింది. సినిమాల్లో కోట్లు ఎందుకు వదిలేసావో ఎవరికి తెలియదు అంటూ పవన్ ని ఉద్దేశించి విమర్శించింది.


User: Filmibeat Telugu

Views: 3.2K

Uploaded: 2018-06-08

Duration: 01:54

Your Page Title