India Vs Afghanistan : Shikhar Dhawan Talks About Rashid Khan

India Vs Afghanistan : Shikhar Dhawan Talks About Rashid Khan

గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్స్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేయడం వల్లనే అతడి బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొగలిగానని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత ఓపెనర్లు రాణించిన సంగతి తెలిసిందే. br ఈ సందర్భంగా ధావన్ మాట్లాడుతూ "రషీద్‌ బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేయడాన్ని నేను ఆస్వాదించాను. అతనిపై ఆధిపత్యం సాధిస్తూ ముందుకు సాగడం కూడా నాకు ఆనందాన్ని కలిగించింది. ఐపీఎల్‌లో మేమిద్దరం ఒకే జట్టులో ఉండటంతో నాకు బాగా కలిసొచ్చింది. ఎక్కువగా నెట్స్‌లో రషీద్‌ బౌలింగ్‌లోనే ప్రాక్టీసు చేసేవాడిని. అదే నాకు ప్రస్తుతం ఉపయోగపడింది. కానీ అతను ఏదో ఒక రోజు తప్పకుండా చెలరేగుతాడు" అని అన్నాడు. br "పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్క ఆటగాడికి ఏదో ప్రణాళిక ఉంటుంది. ఒకరు దూకుడుగా ఆడాలనుకుంటారు. మరొకరు నిదానంగా.. ఇక మురళీ విజయ్‌తో పోల్చుకుంటే నా ఆట అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. క్రీజులో ఉన్నప్పుడు నేను మాత్రం దూకుడుగా ఆడాలనుకుంటాను. ఈ మ్యాచ్‌లోనూ అదే కొనసాగించా" అని ధావన్‌ పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 268

Uploaded: 2018-06-15

Duration: 02:25

Your Page Title