సరికొత్త మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ విడుదల

సరికొత్త మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ విడుదల

జపాన్ దిగ్గజం మిత్సుబిషి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 2018 మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ ప్రీమియం ఎస్‌యూవీని లాంచ్ చేసింది. మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ భారీ ఫీచర్లతో కూడిన సింగల్ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. ఔట్‌ల్యాండర్ ఎస్‌యూవీ ధర రూ. 31.54 లక్షలు ఎక్స్-షోరూమ్(ముంబాయ్)గా ఉంది. br br మిత్సుబిషి ఇండియా ఈ ఔట్‌ల్యాండర్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో నిర్మించిన మోడల్‌గా (CBU) దిగుమతి చేసుకుని ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తోంది. సాంకేతికంగా ఇందులో 2.4-లీటర్ కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ప్రొడ్యూస్ చేసే 164బిహెచ్‌పి పవర్ మరియు 222ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది. br br సరికొత్త మిత్సుబిషి ఔట్‌ల్యాండ్ ఎస్‌యూవీ 7-సీటింగ్ లేఔట్లో లభిస్తోంది. లగేజ్ స్పేస్ పెంచుకోవడానికి రెండవ మరియు మూడవ వరుస సీట్లను సమాంతరంగా మడిపేయవచ్చు. ప్రస్తుతానికి డీజల్ వెర్షన్ ఔట్‌ల్యాండర్ పరిచయం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను ఇండియాకు ఖరారు చేస్తోంది.


User: DriveSpark Telugu

Views: 3K

Uploaded: 2018-06-26

Duration: 01:50