ఎపి కేబినెట్‌లోకి ముస్లిం మంత్రి: చంద్రబాబు

ఎపి కేబినెట్‌లోకి ముస్లిం మంత్రి: చంద్రబాబు

A Muslim leader will get berth in the AP cabinet. CM Chandrababu has already taken a decision on this issue.TDP MLC MA Sharif seems to be that lucky man. br #andhrapradesh br #amaravathi br #cmchandrababu br #cabinetberth br #mlc br br ఎపి మంత్రిమండలిలో తాజాగా ఒక ముస్లిం నేతకు స్థానం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. సిఎం చంద్రబాబు ఈ విషయమై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. br రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు బిజెపి మంత్రులు రాజీనామా చేయడంతో కేబినెట్ లో రెండు ఖాళీలు ఏర్పడగా వాటిని ఇప్పటివరకు భర్తీ చేయలేదు. అయితే ఇందులో ఒకటి ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా నిర్ణయంగా తెలుస్తోంది. అయితే టిడిపి నుంచి నేరుగా ఎమ్మెల్యేగా ముస్లిం మైనారిటీ అభ్యర్థి ఎవరూ లేకపోవడంతో ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని సిఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. br రాష్ట్రంలో గతకొంత కాలంగా రాజకీయ పరిణామాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటుండటం వివిధ సామాజిక వర్గాలకు బాగా కలిసి వస్తోంది. బిజెపి, పవన్ కల్యాణ్ టిడిపికి దూరం కావడంతో వివిధ సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా సామాజిక వర్గాలకు కొత్త కొత్త సంక్షేమ పథకాలు, వరాలు ఇస్తున్నారు. ఈక్రమంలోనే ముస్లింమైనారిటీ వర్గాలను మరింత ఆకట్టుకునేందుకు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2018-07-03

Duration: 03:10