Pro Kabaddi 2018 : Telugu Titans Defeated Patna Pirates | Oneindia Telugu

Pro Kabaddi 2018 : Telugu Titans Defeated Patna Pirates | Oneindia Telugu

Telugu Titans defeated Patna Pirates for the third time in the ongoing edition of Pro Kabaddi League as they secured a 41-36 win. Catch Telugu Titans vs Patna Pirates match highlights. br #ProKabaddiLeague br #ProKabaddi2018 br #TeluguTitans br #PatnaPirates br br గతమ్యాచ్‌లో ఓటమితో నిరాశపరిచిన తెలుగు టైటాన్స్‌ మళ్లీ గెలుపుబాట పట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో టైటాన్స్ సొంతగడ్డపై జరిగిన ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది. గురువారం జరిగిన జోన్‌-బి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ ప్రథమార్ధానికి 26-15తో ఆధిక్యంలో నిలిచిన టైటాన్స్‌ చివరకు 5 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఇలా 41-36 తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ పట్నా పైరేట్స్‌ను ఓడించింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. లీగ్ చరిత్రలో 800 రైడింగ్ పాయింట్లు సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన రాహుల్ ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. రాహుల్‌ చౌదరీ (13) అంచనాల మేర రాణించి అభిమానులకు ఆనందాన్ని మిగిల్చాడు. అతనితో పాటు నీలేశ్ సులంకే (9), మోహసెన్ (5), విశాల్ (4) మెరవడంతో టైటాన్స్‌ సులభంగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2018-12-14

Duration: 01:18

Your Page Title