KTR 'Meet The Press' : KTR Stunning Counter On Lagadapati Survey | Oneindia Telugu

KTR 'Meet The Press' : KTR Stunning Counter On Lagadapati Survey | Oneindia Telugu

KTR says that against all the survey reports Lagadapati report stands Fot mahakutami. Addressing 'Meet the Press' at Somajiguda press club, KTR said that KCR will concentrate on national politics as well as state making Hyderabad as a base. br టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అద్య‌క్షుడు క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు శనివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ దీ ప్రెస్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. కాగా రోజురోజుకీ కేటీఆర్ ఆత్మ‌విశ్వాసం ఇనుమ‌డిస్తోంది. రాష్ట్రంలో చారిత్ర‌క విజయం అనంత‌రం టీఆర్ఎస్ పార్టీ లో కీల‌క ప‌ద‌వి ఆయ‌న్ను వ‌రించింది. ఇప్ప‌టికే జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఛాలెంజ్ విసిరి వాటిని సాధించుకున్న కేటీఆర్ లోక్‌స‌భ‌కు మ‌రో ఛాలెంజ్ విసిరారు. త‌మ పార్టీ వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 16 సీట్లు సాధిస్తుంద‌ని ఘంటాప‌థంగా చెప్పారు. దేశ రాజ‌కీయాల్లో గులాబీ పార్టీ త‌ప్ప‌కుండా గుణాత్మ‌క మార్పు తీసుకొస్తుంద‌ని తేల్చి చెప్పారు కేటీఆర్. జాతీయ రాజ‌కీయాల గురించి కూడా కేటీఆర్ ప్ర‌స్థావించారు. 2019 లోక్‌స‌భ‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌కు అనుకున్న మెజారిటీ రాదు కాబ‌ట్టి 16 లోక్‌సభ స్థానాలు గెల‌వ‌బోయే టీఆర్ఎస్ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంద‌ని వ్యాఖ్యానించారు. అలాంటి త‌రుణంలో దేశ ప్రధానిని తెలంగాణ‌యే నిర్ణ‌యిస్తుంద‌న్నారు. తెలంగాణలో అమల‌వుతున్న పథకాలు దేశవ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు అందాలంటే జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తేనే సాధ్య‌మ‌ని వివ‌రించారు కేటీఆర్‌.


User: Oneindia Telugu

Views: 209

Uploaded: 2018-12-15

Duration: 31:01

Your Page Title