Lakshmi’s NTR Trailer Clocks 4 Million Plus Views In 24 Hours

Lakshmi’s NTR Trailer Clocks 4 Million Plus Views In 24 Hours

"4 million views in just 24 hours for #LakshmisNTRtrailer ..The Gods are really blessing our team ..We all thank you NTR." RGV tweeted.br #Lakshmi'sNTRTrailerbr #RamGopalVarmabr #RGVbr #ChandrababuroleinLakshmi'sNTRbr #LakshmiParvathibr #tollywoodbr br br 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలై ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. 24 గంటల్లో 4 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ దేవుళ్ల ఆశీర్వాదం తమ సినిమాపై ఉండటం వల్లే ఇది సాధ్యమైందని, ఎన్టీ రామారావు కూడా పై నుంచి బ్లెస్ చేసినట్లు తెలిపారు. కాగా.. నిన్న ట్రైలర్ వదిలినప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో చేసిన హడావుడి కూడా చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబు, కేసీఆర్, మోడీ, రాహుల్ గాంధీ చివరకు డొనాల్డ్ డ్రంప్ కూడా తమ మూవీ ట్రైలర్ చూసినట్లు వర్మ కొన్ని ఫోటోలు షేర్ చేయడం గమనార్హం. చిరంజీవి, జూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఫోటోలను కూడా తమ ట్రైలర్ పబ్లిసిటీకి వాడేశాడు.br లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూసిన తర్వాత రాహుల్ గాంధీ ఆలోచనలో పడ్డారా? అనే సందేహం వ్యక్తం చేస్తూ వర్మ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ జాతీయ స్థాయి రాజకీయాల్లో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో వర్మ చేసిన కామెంట్ చర్చనీయాంశం అయింది.br వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘యాత్ర' దర్శకుడితో కలిసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ చూస్తున్నట్లు వర్మ మరో పోస్టులో వెల్లడించడం గమనార్హం.br ‘ఈని గురించి నీకు ముందుగాలే జెప్పినగదరా' అని లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసిన తర్వాత కేసీఆర్.. కేటీఆర్‌కు చెప్పినట్లు ఉన్న పిక్ పోస్ట్ ఫన్ క్రియేట్ చేస్తోంది.br ఈ ట్రైలర్‌లోని వీడిని ఎక్కడో చూసినట్లు ఉంది... అంటూ చంద్రబాబు పిక్‌తో ఆర్జీవీ తనదైన శైలిలో మరో కామెంట్ పెట్టారు.


User: Filmibeat Telugu

Views: 1.8K

Uploaded: 2019-02-15

Duration: 02:17

Your Page Title