Virat Kohli Needs No Protection In The Batting Order Says Sunil Gavaskar | Oneindia telugu

By : Oneindia Telugu

Published On: 2019-02-16

156 Views

01:50

The legendary Indian cricketer Sunil Gavaskar feels that Virat Kohli is the best no.3 batsman and he needs no protection. However, the legend further added that the Indian team management could use Virat Kohli at no.4 in ODIs in special moments.
#ViratKohli
#SunilGavaskar
#worldcup2019
#Souravganguly
#msdhoni
#rohithsharma
#rishabpanth
#cricket
#teamindia

టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎలాంటి రక్షణ అవసరం లేదని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలి? అనే దానిపై గత కొన్ని రోజులుగా మాజీ క్రికెటర్ల మధ్య చర్చ జరుగుతోంది. విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడిస్తామని.. ఇటీవల టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడగా, కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దింపితే అది తెలివి తక్కువ నిర్ణయమవుతుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.
తాజాగా దీనిపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. వరల్డ్ కప్ ముంగిట టీమిండియాకు ఇదే చివరి సిరిస్ కావడంతో జట్టు మేనేజ్‌మెంట్ ఈ సిరిస్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గవాస్కర్ ఇండియూ టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ "ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కోహ్లీకి బ్యాటింగ్ ఆర్డర్‌లో రక్షణ ఏమీ అవసరం లేదు" అని చెప్పుకొచ్చాడు.
"అయితే, ఇంగ్లాండ్ పిచ్‌లు ఒక్కోసారి స్వింగ్‌కి అతిగా అనుకూలిస్తాయి. అలాంటి సమయాల్లో భారీ లక్ష్యఛేదనకు దిగి.. ఆరంభంలోనే వికెట్ చేజార్చుకుంటే? విరాట్ కోహ్లీ వికెట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత టీమిండియాపై ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కోహ్లీని నెం.3లో కాకుండా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాలి" అని గవాస్కర్ సూచించాడు.

Trending Videos - 26 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 26, 2024