ICC Cricket World Cup 2019: New Zealand Won By 6 Wickets On South Africa | Match Highlights

ICC Cricket World Cup 2019: New Zealand Won By 6 Wickets On South Africa | Match Highlights

ICC Cricket World Cup 2019:New Zealand Defeat South Africa By 6 Wickets. South Africa, who suffered a heartbreaking loss to New Zealand in the last edition, had a dismal start to their World Cup campaign, losing three straight games followed by a wash-out before registering their maiden win against bottom-placed Afghanistan. br #iccworldcup2019 br #nzvssa br #kanewilliamson br #martinguptill br #fafduplessis br #quintondekock br #hashimamla br #cricket br br బర్మింగ్‌హామ్‌ వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్‌ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో న్యూజిలాండ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి సెమీఫైనల్‌కు చేరువైంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగో పరాజయంను చవిచూసిన దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. br లక్ష ఛేదనలో న్యూజిలాండ్‌ బాగా ఇబ్బంది పడింది. రబడ వేసిన మూడో ఓవర్లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఓపెనర్ మున్రో (9) వెనుదిరగడంతో కివీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. రెండో వికెట్‌కు విలియమ్సన్ (106 నాటౌట్‌; 138 బంతుల్లో 9×4, 1×6), గప్టిల్‌ (59 బంతుల్లో 35; 5 ఫోర్లు) కలిసి 60 పరుగులు జోడించడంతో ఇన్నింగ్స్‌ కుదుటపడింది. ఈ సమయంలో భారీ షాట్‌ ఆడబోయి అదుపుతప్పిన గప్టిల్‌ తన కాలితోనే వికెట్లను తన్ని పెవిలియన్‌ చేరాడు. br అనంతరం 8 పరుగుల వ్యవధిలో మోరిస్‌ తన వరుస ఓవర్లలో టేలర్‌ (1), లాథమ్‌ (1) ఔట్‌ చేసి కివీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. అయితే విలియమ్సన్‌కు నీషమ్‌ (23) అండగా నిలిచాడు. ఈ జోడి ఐదో వికెట్‌కు 57 పరుగులు జత చేసింది. ఈ దశలో నీషమ్‌ను ఔట్‌ చేయడం ద్వారా మోరిస్‌ మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చేశాడు. అయితే విలియమ్సన్‌కు తోడు గ్రాండ్‌హోమ్‌ (60; 47 బంతుల్లో 5×4, 2×6) దూకుడైన బ్యాటింగ్‌ కివీస్‌ను లక్ష్యం దిశగా నడిపింది.


User: Oneindia Telugu

Views: 164

Uploaded: 2019-06-20

Duration: 02:15

Your Page Title