PV Sindhu Meets AP CM YS Jagan At Secretariat

PV Sindhu Meets AP CM YS Jagan At Secretariat

Indian badminton star PV Sindhu met with AP Chief Minister YS Jagan Mohan Reddy at the state Secretariat in Amaravati on Friday. On the occasion, CM YS Jagan has congratulated Sindhu from wining gold medal at BWF World Championships which held on August 25. Sindhu parents, Minister Avanthi Srinivas, and other officials were present in the meeting. br #PVSindhu br #BadmintonStar br #APCMYSJagan br #Secretariat br #BWFWorldChampionship br #AvanthiSrinivas br #Vizag br br వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఆమె సీఎంను సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం జగన్ శాలువాతో సత్కరించారు. ఆమెతో పాటు మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. సింధూ.. తనకు దక్కిన బంగారు పతకాన్ని సీఎం జగన్‌కు చూపిస్తూ మురిసిపోయారు. అనంతరం ఒక బ్యాడ్మింటన్ బ్యాటును సీఎంకు బహుకరించారు. కాగా, అంతకుముందు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పీవీ సింధుకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ప్రవీణ్ కుమార్, స్పోర్ట్స్ ఎండీ భాస్కర్ ఘన స్వాగతం పలికారు.విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తామని సీఎం చెప్పారని పీవీ సింధు తెలిపారు. సింధుతోపాటు ఆమె తల్లిదండ్రులు కూడా సీఎంను కలిశారు.


User: Oneindia Telugu

Views: 147

Uploaded: 2019-09-13

Duration: 01:57

Your Page Title