Kerala Couple In Their 60s Marry At Old-Age Home

Kerala Couple In Their 60s Marry At Old-Age Home

An elderly sexagenarian couple got married in Kerala's Thrissur. Love story of the couple developed at an old-age home in Ramavarmapuram in Thrissur district.br #Keralalovestory br #Keralacouplemarriagebr #KochaniyanMenonbr #LakshmiAmmalbr #Thrissurdistrictbr br ఆదివారం రోజున ట్విటర్‌ వేదికగా ఓ కపుల్‌కు మ్యారేజ్ విషెస్ అందాయి. చాలామంది నెటిజెన్లు ఈ కపుల్‌ను విష్ చేశారు. ఇంతకీ ఈ కపుల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా..? వీరిద్దరూ లేటు వయస్సులో ఘాటు ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారి తీసింది. అంతే ప్రేమకు వయసుతో ఏంటి పని మనసుతోనే పని అంటూ నెటిజెన్లు కామెంట్స్ పోస్టు చేస్తూ ఈ ఓల్డ్ కపుల్‌ను విష్ చేశారు. ఇక అసలు కథ ఏంటో చూద్దాం.br 60 ఏళ్ల వయస్సులో ఆ తాత బామ్మలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరు కలుసుకుంది మాత్రం ఒక వృద్ధాశ్రమంలో. వీరిద్దరూ కలుసుకోవడం, మాటా మాటా మార్చుకోవడం, స్నేహంగా జీవించడం ప్రారంభించారు. ఇక ఆ పరిచయం ప్రేమగా మారింది. ఎంతలా ఉంటే ఉదయాన్నే ఒకరినొకరు చూసుకోకుండా వారి దినచర్యను ప్రారంభించరట. అంతగా డీప్‌లవ్‌లో పడిపోయారు. ఇంతకీ ఆ నవయువ ప్రేమికుడి పేరు, మంచి మనసున్న ఆయన ప్రియురాలి పేరు చెప్పలేదు కదూ... అక్కడికే వస్తున్నాం. ఆ ప్రేమికుడి పేరు కొచానియన్ మీనన్, ఆయన ప్రియురాలి పేరు లక్ష్మీ అమ్మాళ్. అయితే ఇక్కడ ఓ ట్విస్టు కూడా ఉందండోయ్...br ప్రేమికుడు కొచానియన్ మీనన్ కొన్నేళ్ల కిందట లక్ష్మీ అమ్మాల్ తొలి భర్త దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడట. అయితే ఆమె భర్త చనిపోవడంతో కొచానియన్ కూడా పనిమానేసి వేరే చోటుకు వెళ్లిపోయారట. ఇక బామ్మ లక్ష్మీ భర్త చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆమెను వెలేశారు. దీంతో కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ వృద్ధాశ్రమంలో చేరింది. అక్కడే కొచానియన్ మీనన్‌ను చూసి ఎంతో సంబరపడింది. పాత పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి అతనితో చాలా సన్నిహితంగా మెలిగింది. ఇదే వారి మధ్య ప్రేమను వికసింపజేసింది. ఇంకేముంది పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇదే విషయాన్ని వృద్ధాశ్రమంలో ఉన్న ఇతరులకు చెప్పగానే వారు ఆనందంతో అంగీకరించారు.br అయితే ఈ వివాహ వేడుక మామూలుగా జరగలేదండోయ్.సంప్రదాయబద్దంగా వివాహ వేడుక జరిగింది. ఇక వీరి ప్రేమకథ కేరళ రాష్ట్ర మంత్రి వీఎస్ శివకుమార్‌కు తెలిసింది.


User: Oneindia Telugu

Views: 204

Uploaded: 2019-12-30

Duration: 03:02