Andhra Pradesh High Court quashes all the Amaravati Insider Trading Cases | Oneindia Telugu

Andhra Pradesh High Court quashes all the Amaravati Insider Trading Cases | Oneindia Telugu

Andhra Pradesh High Court on tuesday quashes all the insider trading cases lodged by ap cid in amaravati.br br #AmaravatiInsiderTradingbr #Amaravatilandsbr #AndhraPradeshHighCourtbr #YSRCPbr #TDPbr #APCapitalbr #apcidbr #AmaravatiInsiderTradingCasesbr br ఏపీలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చోటు చేసుకుందంటూ వైసీపీ సర్కారు చేస్తున్న ఆరోపణలన్నీ నిజం కాదని తేలిపోయాయి. అమరావతిలో రాజధాని వస్తుందని తెలిసి టీడీపీ నేతలు భారీ ఎత్తున భూములను కొనుగోలు చేయడం ద్వారా అనుచితంగా లభ్ది పొందారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులను ఇవాళ ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ పరిణామం అధికార వైసీపీ సర్కారుకు భారీ షాక్‌ కలిగించగా.. విపక్ష టీడీపీకి భారీ ఊరటనిచ్చింది. 2015లో ఏపీ రాజధానిగా అమరావతిని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. అంతకుముందే రాజధానిని అమరావతిలో పెడుతున్నట్లు సొంత పార్టీ నేతలకు లీకులు ఇవ్వడం ద్వారా ఇక్కడ భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసేందుకు సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ పెద్దలు అవకాశం కల్పించినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. గతంలో విపక్షంలో ఉండగా ఇవే ఆరోపణలు చేసిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ దర్యాప్తుకు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీఐడీ దర్యాప్తు చేపట్టి అప్పటి మంత్రులు, టీడీపీ సీనియర్‌ నేతలు పలువురిపై కేసులు నమోదు చేసింది.


User: Oneindia Telugu

Views: 13.8K

Uploaded: 2021-01-19

Duration: 01:03

Your Page Title